మీ పేరు E అక్షరంతో మొదలు అవుతుందా..మీ జీవితంలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు     2018-04-18   01:59:30  IST  Raghu V

సంఖ్యా శాస్త్ర రీత్యా ఆంగ్ల అక్షరం E తో ఎవరి పేరు ప్రారంభం అవుతుందో వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. వీరి బలాలు,బలహీనతలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

వీరు తమలోని ప్రతిభను గురించి ఆ దిశగా అడుగులు వేసి ఆ రంగంలో బాగా రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు. వీరు మనస్సులో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కృషి చేసి ఆ లక్ష్యాన్ని సాధించటంలో సఫలం అవుతారు. లక్ష్యాన్ని సాధించటానికి ఏ మార్గంలో అయినా వెళ్ళటానికి సిద్ధం అవుతారు. ఆలా అని చెడు మార్గంలోకి వెళ్ళరు. వీరు ఏది సాధించాలన్నా మంచి మార్గంలోనే సాధిస్తారు. వీరు ఎంత పెద్ద కార్యాన్ని అయినా ఒంటరిగా చేయటానికి ఇష్టపడతారు.

మీ పేరు E అక్షరంతో మొదలు అవుతుందా..మీ జీవితంలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు

వీరికి టీమ్ వర్క్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అందువల్ల ఎంత కష్టమైన ఒంటరిగా చేయటానికే ఇష్టపడతారు. పది మంది మధ్యలో పని చేయటానికి ఇష్టపడరు. ఒంటరిగా,ప్రశాంతంగా ఎంత పనిని అయినా చేసేస్తారు. పనిలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోరు. అదే పని పూర్తి అయ్యాక అందరితోనూ సరదాగా ఉంటారు.