మీ పేరు D అక్షరంతో మొదలు అవుతుందా? మీ జీవితంలో జరిగే ఆసక్తికరమైన విషయాలు     2018-04-07   02:30:36  IST  Lakshmi P

ఎవరి పేరు అయితే మొదటి అక్షరం D తో మొదలు అవుతుందో వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. D అక్షరంతో పేరు మొదలు అయ్యేవారిలో శక్తి సామర్ధ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు సంఘంలో పేరు ప్రఖ్యాతులు,గౌరవం కోసం చాలా కష్టపడతారు. వీరు బందువులకు ప్రాముఖ్యతను ఇస్తారు.

Name Start With D letter


వీరు అందరూ కలిసి ఉండాలనే భావన కలిగి ఉంటారు. అంతేకాక స్నేహానికి కూడా ఎక్కువ విలువ ఇస్తారు. వీరికి విహార యాత్రలకు వెళ్ళటానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దైవ కార్యాలలో కూడా తరచుగా పాల్గొంటారు. స్నేహితులతో ఆనందంగా గడపటానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వటమే కాకుండా వారితో ఎంజాయ్ చేయాలనీ భావిస్తారు.

కుటుంబం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు. కుటుంబంలో ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని దైర్యంగా అధికమిస్తారు. వీరిలో 80 శాతం మంది చదువులో రాణిస్తారు. మిగతా 20 శాతం మంది సందేహం,భయంతో ముందడుగు వేయలేరు. ఆలా కాకుండా సందేహం,భయాలను వదిలేస్తే చదువులో బాగా రాణిస్తారు.