Nama Nageswar Rao quits TDP..?

ఖ‌మ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు పేరు తెలుగు రాజ‌కీయాల్లో తెలియ‌ని వారు ఉండ‌రు. కాంగ్రెస్ లేడీ ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌద‌రిని ఓడించిన నామా ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో కింగ్ అయిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతోనే ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్య‌వ‌హ‌రించారు. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అండ‌తో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన నామా అన‌తి కాలంలోనే చంద్ర‌బాబుకు ద‌గ్గ‌రై అదే తుమ్మ‌ల‌తో తీవ్రంగా విబేధించారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నామా ఇప్పుడు తెలంగాణ టీడీపీలోను, ఖ‌మ్మం జిల్లాలోను ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇక తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వ‌ర్సెస్ నామా నాగేశ్వ‌ర‌రావు మ‌ధ్య జ‌రుగుతోన్న వార్‌లో చంద్ర‌బాబు నామాకు ప్ర‌యారిటీ ఇవ్వ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన తుమ్మ‌ల టీఆర్ఎస్‌లోకి జంప్ చేయ‌డం మంత్రి అవ్వ‌డం, ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ, ఆ త‌ర్వాత పాలేరు ఉప ఎన్నిక‌ల్లో గెలిచి ఎమ్మెల్యే అయిపోవ‌డం చ‌క‌చకా జ‌రిగిపోయాయి.