Nakshatram Movie Review

చిత్రం : నక్షత్రం
బ్యానర్ : బుట్ట బొమ్మ క్రియేషన్స్
దర్శకత్వం : కృష్ణవంశీ
నిర్మాతలు : శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు
సంగీతం : భీమ్స్, హరి, భరత్
విడుదల తేది : ఆగష్టు 4, 2017
నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజినా, ప్రగ్యా, ప్రకాష్ రాజ్

ఒకనాటి క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ హిట్ కొట్టి చాలాకాలమైంది. కంబ్యాక్ ఆశలతో మొదలుపెట్టిన నక్షత్రం సినిమా తీయడానికి కూడా చాలాకాలమైంది.. ఇద్దరేసి హీరోలు, ఇద్దరేసి హీరోయిన్లతో తీసిన నక్షత్రం కృష్ణ వంశీ కెరీర్ లో నక్షత్రంలా మిగిలిపోతుందో లేదో చూడండి.

కథలోకి వెళితే :


రామ రావు (సందీప్ కిషన్) కి పోలీసు అంటే పిచ్చి. పోలీసు అవడం కోసం ఎంతైనా కష్టపడతాడు. అతని కుటుంబంలో తండ్రి మరియు తాత కూడా పోలీసు అవడం వలన తను కూడా ఆ లేగేసిని నిలబెట్టేలా పోలీసు అవ్వాలి అనుకుంటాడు. ఇతని ప్రేయసి జమున రాణి (రెజినా).

రామ రావు పోలీసు ప్రయత్నాల్లో ఉండగా అతడి జీవితంలో కి వస్తాడు తనీష్. రామ రావుకి అతను అడ్డంకిగా ఎందుకు మారాడు ? కథలో అలేగ్జందర్ ఎవరు ? రామారావు తను అనుకున్నన లక్ష్యాన్ని సాధించాడో లేదో సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన :


కృష్ణ వంశీ సినిమాలు అంటే పాత్రలు ఎలా ఉంటాయో, ఆ పాత్రధారులు తెర మీద ఎలా మాట్లాడుతారో మనకు బాగా తెలుసు. ఏ నటుడు అయినా సరే, తన సహజశైలిని వదిలిపెట్టి కృష్ణ వంశీ శైలిలోకి రావాల్సిందే. సందీప్ కిషన్ కి ఇలాంటి పాత్ర చాలా కొత్త. కొన్నిచోట్ల బాగా పలికిన భావోద్వేగాలు, కొన్ని చోట్ల ఒవర్యాక్షన్ లా అనిపిస్తాయి. సందీప్ ఒక్కడనే కాదు, అందరి పరిస్థితి అంతే. రెజినా, ప్రగ్య గ్లామర్ డోసు ఎక్కువైంది. అందరిలోకి సాయిధరమ్ తేజ్ పాత్ర బెటర్. ప్రకాష్ పర్వాలేదు. తనీష్ విలనిజం అస్సలు బాగా లేదు. శివాజీరాజ పాత్ర టూ మచ్ లౌడ్. అందరు మంచి నటులే ఉన్నా, నటనకి ఓ లిమిట్ పెట్టుకోకుండా నటించారు.