వావ్.. కోడలా!! సర్‌ ప్రైజ్ చేయకుండా ఉండవ్ గా.! నాగ్ ట్వీట్.! ఇంతకీ సామ్ ఏం చేసింది?     2018-08-19   09:57:12  IST  Sainath G

అక్కినేని కోడలు సమంత వరుస సినిమాలతో మంచి జోరుమీదుంది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఆమెకు వరుస విజయాలు దక్కుతున్నాయి. ఇటీవలే ‘‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’’ రూపంలో భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సామ్ తాజాగా ‘యూ టర్న్’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

తాజాగా శుక్రవారం నాడు అక్కినేని సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘యు టర్న్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ మూవీని తెలుగులో అదే పేరుతో తెరకెక్కించారు. మిస్టరీ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో సమంత జర్నలిస్ట్‌గా కనిపించింది. ఇక ఈ ట్రైలర్‌కు రెస్పాన్స్ అదిరిపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Samantha Surprise,u Turn Movie Trailer Telugu

అక్కినేని నాగార్జున, అక్కినేని సమంత ఈ మామా కోడళ్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఇక సినిమా ప్రమోషన్స్‌‌కు సోషల్ మీడియాను విరివిగా వాడేస్తుంటారు అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా కోడలు సమంతపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు. ‘వావ్.. నువ్వు సర్ ప్రైజ్ ఇవ్వకుండా ఉండవుగా కోడలు పిల్లా..’ అంటూ యూటర్న్ ట్రైలర్‌ను సోషల్ మీడయాలో పోస్ట్ చేయడంతో అక్కినేని అభిమానులకు ఈ మామా కోడళ్ల ఆన్ లైన్ ముచ్చట్లు తెగ నచ్చేస్తున్నాయి.

లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://twitter.com/iamnagarjuna/status/1030403737947230208