జనసేనకి తోడుగా చిరు..ఆ కీలక నేత ఎంట్రీ షురూ     2018-06-23   23:05:31  IST  Bhanu C

జనసేన పార్టీలో జనసేన అనే పదంలో ఉన్న జనం పార్టీలో కనిపించడం లేదు..ఒంటికాయకొమ్ము లాగా పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపిస్తూ ఉంటాడు..అయితే నాలుగేళ్ల కాలంలో ఒక్క వ్యక్తిని కూడా పార్టీలోకి ఆహ్వానించకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పవన్ తీరు పట్ల విసుగు చెందిన అన్న చిరంజీవి మొత్తానికి నడుం బిగించాడు..పార్టీ భాద్యతలని మీద వేసుకున్నాడు..తెలుగుదేశంతో పడక బయటకి వచ్చేస్తున్న కీలక నేతలని ఆకర్షించడం కూడా చేయకుండా ఒక్కడే ఎన్నాళ్ళు ఉంటావ్ అంటూ క్లాస్ పీకిన చిరు ఇప్పుడు జనసేనని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు..అందులో భాగంగానే..

కాంగ్రెస్ లో చిరుకి ఉన్న విస్తృత పరిచయాలతో కొందరు ముఖ్య నేతలను జనసేన లోకి తీసుకుని వస్తున్నారని సమాచారం, చిరంజీవి కి అత్యంత సన్నహిత మిత్రుడు అయిన అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.నాదెండ్ల మనోహార్ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు..అయితే పవన్ నాదెండ్ల భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…ఈ భేటీ ఏందుకు అనేది ఖచ్చితంగా తెలియకపోయినా ఆయన వచ్చే ఎన్నికల్లో జనసేన లోకి వెళ్తారని సంచారం అందుతోంది.