నా పేరు సూర్య మూవీ రివ్యూ     2018-05-03   22:30:22  IST  Raghu V

టైటిల్‌: నా పేరు సూర్య‌

బ్యాన‌ర్‌: రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, అనూ ఎమ్యాన్యుయేల్‌, శ‌ర‌త్‌కుమార్‌, అర్జున్‌, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు

కెమేరా: రాజీవ్ ర‌వి

సంగీతం: విశాల్ శేఖ‌ర్‌

కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాత‌లు: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీథ‌ర్ – బ‌న్నీ వాస్‌

ద‌ర్శ‌క‌త్వం: వ‌క్కంతం వంశీ

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

సినిమా నిడివి : 167 నిమిషాలు

విడుద‌ల తేదీ: 04 మే, 2018

మెగా ఫ్యామిలీ నుంచీ వచ్చిన “స్టైలిష్ స్టార్” అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి తగ్గట్టుగానే మంచి పేరు తెచ్చుకున్నాడు..ఇప్పుడు ప్ర‌స్తుతం అల్లూ అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు…రేసుగుర్రం సినిమా నుంచీ వచ్చిన దూకుడు కంటిన్యూ అవుతూనే ఉంది…రేసుగుర్రం నుంచి డీజే వ‌ర‌కు బ‌న్నీ చేసిన సినిమాలు అన్ని టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించేస్తున్నాయి. ..ఇప్పటి వరకూ బన్నీ తన కెరియర్ లో చేసిన సినిమాలు అన్నీ ఒకెత్తు ఈరోజు రిలీజ్ అయిన నా పేరు సూర్య‌. ఓ కెత్తు..తన కెరియర్లో నే ఈ సినిమా ఒక మెయిలు రాయిగా నిలుస్తుందని భావిస్తున్నాడు బన్నీ.. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా నిర్మించారు. కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం, అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్‌గా క‌నిపించ‌డంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోను ఉంది…దీనికి తోడు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ ఏకంగా రూ.80 కోట్ల‌కు అమ్ముడుపోయాయి..మరి ఎన్నో అంచనాలతో విడుదల అయ్యిన సూర్య అభిమానులని అలరించాడా..? సగటు ప్రేక్షకుడి కి నచ్చాడా..? అన్నది Telugustop.com విశ్లేషణం లో చూద్దాం

స్టోరీ : సూర్య ( అల్లూ అర్జున్) కి ఆవేశం చాలా ఎక్కువ..విపరీతమైన కోపం కలిగిన సుర్యాకి ఆర్మీలో కి వెళ్ళాలనే కోరిక ఎంతో బలంగా ఉంటుంది..ఎంతో పట్టుదలతో అర్మీలోకి వెళ్ళిన సూర్య అక్కడ కొన్ని పరిణామాల వలన పనిష్మెంట్ కి గురవుతాడు..అయితే మళ్ళీ ఆర్మీలో చేరడానికి తండ్రి సంతకం తప్పని సరి కావడంతో సూర్యా తండ్రి సైంటిస్ట్ అయిన అర్జున్ వద్దకి వెళ్తాడు..అయితే అక్కడ తండ్రి సంతకం పెట్టడం కోసం సూర్యా కి కొన్ని కండిషన్స్ పెడుతాడు.. అయితే అక్కడ జరిగే అనూహ్యమైన పరిణామాల నేపధ్యంలో…అన్నిటికీ నెగ్గిన సూర్య ఎంతో ఇష్తమైన అర్మీలోకి వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తాడు..అయితే సూర్యని ఎందుకు ఆర్మీ అధికారులు సస్పెండ్ చేస్తారు..? తండ్రి సంతకోసం కోసం వచ్చిన సూర్య కి తన తండ్రి ఏమని కండిషన్స్ పెడుతాడు..? ఎంతో ఇష్టమైన అర్మీని వీడి సూర్య ఎందుకు తండ్రి దగ్గర ఉండిపోవాలని అనుకుంటాడు..? మళ్ళీ ఎలా సూర్యా అర్మీలోకి వెళ్తాడు..? అనేది కధ.