గడ్డం గీసుకోవట్లేదు అని భర్త ముఖంపై మరిగిన వేడి నీళ్ళతో దాడి చేసింది

భర్త పేరు సల్మాన్ ఖాన్. భార్య పేరు నగ్మా. ఉండేది ఉత్తరప్రదేశ్ లోని అలిగర్హ్ ప్రాంతంలో. ఇస్లాం మతనమ్మకాల ప్రకారం గడ్డం పెంచటం సల్మాన్ కి అలవాటు. దాన్ని పెద్దగా గీసుకోవడం ఇష్టపడడట. కాని అదే గడ్డం అతడి భార్యకి నచ్చట్లేదు. తీసేయమని పలుమార్లు అడిగింది. తీయలేనని భర్త చెప్పాడు, అందులోను ఇది రంజాన్ మాసమని బదులిచ్చాడు. అంతే, ఆమె కోపం కట్టలు తెంచుతుంది. సలసలమనే వేడి నీటితో అతడి మీద దాడి చేసింది. ముఖం, మెడ, భుజంపై సల్మాన్ కి తీవ్ర గాయాలయ్యాయి.

మొత్తం ఒంటి మీద 20% గాయలున్నాయట. భర్త గట్టిగా అరవడంతో రోడ్డు మీద జనం వచ్చి జేఎన్ మెడికల్ కాలేజికి తరలించారు. చికిత్స మొదలుపెట్టిన డాక్టర్లు, ఇప్పుడు సల్మాన్ కండీషన్ ఫర్వాలేదని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జీ చేస్తామని చెప్పారు. పోలీసులు నగ్మాని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం సల్మాన్ మతాన్ని, మతవిశ్వాసాలను బలంగా నమ్మే వ్యక్తి అంట. గడ్డం గీసేవాడు కాదు. కుర్త పైజామా మాత్రమే తొడిగేవాడు. మోడ్రన్ దుస్తులని ఇష్టపడేవాడు కాదు. స్టయిల్ గా వెంట్రుకలను దువ్వేవాడు కాదు. కాని నగ్మ ఇందుకు పూర్తి భిన్నం. కొంచెం మోడ్రన్ అమ్మాయి. తనలాగే తన భర్త కూడా ఉండాలి అనుకుంటుంది. గడ్టం గీయమని, క్లీన్ షేవ్ ఉంచుకోమని చెప్పేదట. కుర్త పైజామా వదిలేసి జీన్స్ తొడగమని బలవంతపెట్టేదట. ఇద్దరికి పెళ్ళి జరిగి ఆరు నెలలైతే, ఆరు నెలల నుంచే ఇదే గొడవ. కాని సల్మాన్ భార్య చెప్పిందేది వినలేదు.

ఇక మొన్న మళ్ళీ గడ్టం మీద గొడవ మొదలైంది. తీసేయ్యమని భార్య, తీయనని భర్త. ఇద్దరికి మాటమాట పెరిగింది. క్షణికావేశంలో స్టోవ్ మీద మరుగుతున్న నీటిని తీసుకోని అతడి ముఖంపై చల్లేసింది. కాలిన గాయాలతో సల్మాన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.