రాజకీయాల్లో గెలుపుకోసం మురళీ మోహన్ భారీ స్కెచ్    2017-10-27   21:40:11  IST 

మురళీ మోహన్ పెద్దగా ఎవ్వరికి ఈయన గురించి చెప్పవలసిన అవసరం లేదు..పరిచయం చేయక్కలేని మనిషి..చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటు..రాజకీయాలంటే ఎంతో ఆశక్తి ఉన్న సిని నటుల్లో ఒకరు..మా అధ్యక్షుడిగా..రియలెస్టేట్ వ్యాపారిగా ఎంతో కీర్తిని..ఆర్ధిక శక్తిని గడించాడు. అయితే చాలా కాలం సైలెంట్గా ఉన్న రాజమండ్రి ఎంపీ మురళి మోహన్ రాబోయే ఎన్నికల దృష్ట్యా స్పీడ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. అందుకోసం మెగా ప్లాన్ వేశారు ఎంపీ. ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించి వారికి దగ్గరయ్యేందుకు మెగా వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టనున్నారు.

2009 పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ పై స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలు అయ్యాక మురళీమోహన్ పట్టుదలగా రాజమండ్రి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువ అయ్యారు. సినీ షో లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నింటికన్నా అందరికి ఉపయోగపడింది ఆయన నిర్వహించిన మెగా వైద్య శిబిరాలు.అవును అవే మురళీ మోహన్ కి పెద్ద అసెట్ అయ్యాయి.అందుకే మరోసారి తన ప్లాన్ అమలు పరిచే పనిలో ఉన్నాడు.