Mumbai mother delivered a “pregnant” baby boy

రెండు తలలతో పుట్టిన శిశువు గురించి చాలాసార్లు విన్నాం. ఇక ఒకే గర్బంలో ఇద్దరు, ముగ్గురు పుట్టడం వింత విషయం కాదు. ఇద్దరు శిశువులు అంటుకొని పుట్టడం కూడా చాలాసార్లు చూసాం. కాని పుట్టగానే గర్భంతో పుట్టిన శిశువుని ఎప్పుడైనా చూసారా? అదికూడా గర్భంలో మరో శిశువుతో. అందులోనూ ఒక మగశిశువుని. ఇలాంటి వింత ఎక్కడో కాదు, మన దేశంలోనే జరిగింది. ముంబైలో జరిగింది.

అది ముంబైలోని ముంబ్రా ప్రాంతం. థానే జిల్లాలోని ఓ ప్రముఖ ఆస్పత్రి. జులై 20న జన్మించిన ఓ మగశిశువు తన కావల తమ్ముడితో బయటకి వచ్చాడు. అయితే మిగితా కావల పిల్లల్లా ఆ పసికందు తలి గర్భంలో డైరెక్ట్ గా కాకుండా, తల్లి గర్భంలో ఉన్న అన్న గర్భంలో పెరిగాడు. కాని అసంపూర్తిగా పెరిగాడు. చాలా అరుదైన ఈ కండీషన్ పేరు “Foetus in Foetu” అని డాక్టర్లు చెప్పారు. ఇందులో పూర్తిగా పెరిగిన బిడ్డను, లేదా తల్లి గర్భంలో సాధారణంగా పెరిగిన బిడ్డను “Host Baby” అని అంటారు. పసికందు గర్భంలో ఏర్పడిన బిడ్డను “Parisitic Twin” అని అంటారు. ఈ పరిసిటిక్ ట్విన్ ఆ పసివాడి గర్భంలో 7 సెంటిమీటర్ల మేరకు ఏర్పడింది.