రెండు లేదా అంతకన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రిటీలు వీళ్ళే, వారెవరో చూడండి...     2018-05-29   04:00:16  IST  Raghu V

తెర పైన వారి నటనతో స్టెప్పు లతో మనల్ని ఆకట్టుకుంటారు సినిమా హీరోలు..వారిని చూస్తూ మనం మురిసిపోతాం , వారిని పిచ్చిగా అభిమనిస్తాం. వారు నిజ జీవితం లో చేసే కొన్ని పనుల వల్ల జనాల్లో కొంత అవిశ్వాసం ఉంటుంది.ఆ హీరోయిన్ కి ఈ హీరో తో ఎఫైర్ ఉంది , ఈ హీరో కి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంటూ చాలా పుకార్లు వస్తాయి ..అందులో వాస్తవం ఏదైనా , కొందరు సినీ సెలబ్రిటీలు ఒకసారి పెళ్లయ్యాక మళ్ళీ పెళ్లి చేసుకున్నారు.. వారెవరో చూడండి

కమల్ హాసన్

కమల్ హాసన్ 1988లో సారికాను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఈ స్టార్ కి రెండో పెళ్లి. అంతకు ముందు డ్యాన్సర్ వాణీ గణపతిని పెళ్లి చేసుకుని 10 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ తో గౌతమితో సహజీవనం సాగించి చివరకు ఆ బంధానికి కూడా పుల్ స్టాప్ పెట్టారు ఇరువురూ ఏకాభిప్రాయంతో..

కృష్ణ

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరో అయిన సూపర్ స్టార్ క్రిష్ణ.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట 1961లో ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 1969లో నటి విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాడు. విజయ నిర్మలాకు కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం.