ఎంపీ వద్దు ఎమ్యెల్యే అయితే ఒకే ! ఇప్పుడు ఇదే స్పెషల్ స్టేటస్     2018-07-02   05:35:35  IST  Bhanu C

ఏపీ ప్రత్యేక హోదా అంశం రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిత్తశుద్దిగా హోదా కోసం పోరాడడం మాట ఎలా ఉన్నా హడావుడి మాత్రం బాగా చేసేసారు. హోదా కోసం పోరాడింది మేము అంటే మేము అని పోటీలుపడి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ప్రజల్లో హోదా సెంటిమెంట్ బలంగా ఉండడంతో రాబోయే ఎన్నికల్లో ఇదే అస్త్రంగా చేసుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రతిపార్టీ పావులు కదుపుతున్నాయి.

అసలు ఏపీకి హోదా అవసరమా అంటే అవసరమే . ఎందుకంటే … ఏపీ అభివృద్ధి చెందాలన్నా,నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు రావాలన్నా,రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల‌న్నా, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాల‌న్నా,ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెర‌గాల‌న్నా,ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌న్నా,రైతుల‌కు మేలు చేకూరాల‌న్నా వీటన్నింటికి స్పెషల్ స్టేటస్ వచ్చి తీరాల్సిందే. అందుకే రాజకీయ పార్టీలు కూడా వీటిపై అంతగా దృష్టిపెట్టాయి.

ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలంటే కేంద్రంతో అంటకాగాలని ముందుగానే భావించిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీతో గత ఎన్నికల ముందు జతకట్టాడు. ఇంకేముంది మోదీ ఏపీకి వారలు ఇచ్చేయబోతున్నాడు..ప్ర‌పంచ న‌గ‌రాలు సిగ్గుప‌డేలా అమ‌రావ‌తి రాజధానిని నిర్మిస్తామ‌ని,స్పెష‌ల్ స్టేట‌స్ ఐదేళ్లేం క‌ర్మ‌,ప‌దేళ్లు ఇస్తాడ‌ని, ఇలా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య చంద్రబాబు ఉండిపోయాడు. అయితే మోదీ మాత్రం మొండి చేయి చూపించాడు.