పశ్చిమ టీడిపిలో రాజీనామాలు..

పశ్చిమ టీడీపిలో రాజకీయం వేడెక్కుతోంది..ఏలూరు ఎంపీ మాగంటి బాబు..చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత మధ్య వార్ చాలా తీవ్రంగా నడుస్తోంది. చివరికి ఆ నియోజక వర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు రాజీనామాలు చేసే పరిస్థితి వరకూ వచ్చింది. ఇప్పటికే పశ్చిమ తెదేపాలో అసమ్మతి తీవ్రస్థాయిలో ఉంది అయినా సరే పార్టీ అధిష్టానంకి భయపడి ఎవ్వరు నోరు మెదపడటం లేదు కానీ ముందు నుంచి పీతల సుజాత విషయంలో మాగంటి చాల సీరియస్ గా ఉంటూనే ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులు భర్తీ చేసేశారు.కానీ ఇప్పటివరకు చింతలపూడి మార్కెట్ కమిటీ స్థానం అలానే ఉంది. కారణం మా వాళ్ళు ఉండాలి అంటే మా వాళ్ళు ఉండాలి అని ఇరువురు నేతలు పంతాలకి పోవడమే.