కేసీఆర్ కుమార్తెకు టెన్ష‌న్ ఎందుకు..!    2018-04-11   01:14:54  IST 

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత అంటేనే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ ఫైర్‌బ్రాండ్‌. ఇక టీఆర్ఎస్‌లో అయితే ఏకంగా సీఎం గారాలప‌ట్టి కావ‌డంతో చాలా విష‌యాల్లో ఆమె చెప్పిందే వేదం. గ‌త ఎన్నిక‌ల్లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి నిజామాబాద్ ఎంపీ సీటు నుంచి భారీ మెజార్టీతో గెలిచిన క‌విత ఈ నాలుగేళ్ల‌లో రాజ‌కీయంగా స్థానికంగా కంటే స్టేట్ లీడ‌ర్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేశారు.

విప‌క్షాల నుంచి త‌ర‌చూ వినిపించే కేసీఆర్ ఫ్యామిలీలో ఈ న‌లుగురితే అధికారం అన్న విమ‌ర్శల్లో ఆమె కూడా ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అంటే కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్‌రావుతో పాటు ఎంపీ క‌విత కూడా ఉన్నార‌న్న‌ది తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం ఆమె కేంద్ర మంత్రి ప‌ద‌వి మీద ఆశ‌లు పెట్టుకున్నార‌ని.. ఆ కోరిక తీరే ఛాన్సులు లేక‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె జ‌గిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్టేట్ కేబినెట్‌లో మంత్రి అయ్యే ప్లాన్ చేస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఉన్న పొలిటిక‌ల్ ప‌రిస్థితుల‌ను, టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం క‌విత సీటును కేసీఆర్ మార్చే ప్ర‌శ‌క్తే లేదంటున్నారు. అయితే క‌విత మ‌ళ్లీ ఎంపీగా పోటీ చేస్తే గెలుపు మాత్రం అంత స‌లువు కాదు. ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు తీవ్ర‌మైన ఎదురుగాలి వీస్తోంది. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌విత కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కిపై 1.67 లక్షల మెజారిటీతో విజయం సాధించారు.