Movie ticket prices hiked in Telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ టాలీవుడ్ సినీ అభిమానుల‌కు బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో థియేట‌ర్ య‌జ‌మానుల‌కు టిక్కెట్ రేటు పెంచుకునేందుకు అనుమ‌తి ఇస్తూ కేసీఆర్ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు ప్రేక్ష‌కుడిపై కాస్త ఎక్కువ‌గానే భారం ప‌డ‌నుంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ధరను రూ.120కు పెంచగా.. లోయర్‌ క్లాస్‌ టికెట్‌ ధరను రూ.40కి పెంచారు.

ఇక మునిసిపాలిటీల ప‌రిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ధర రూ.80 కాగా, లోయర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.30గా నిర్ణయించారు. పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ధర రూ.70కి పెంచగా.. లోయర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.20కి పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చారు.

థియేట‌ర్ల ఆధునీక‌ర‌ణ టికెట్‌పై రూ.7 నుంచి 5కు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఏసీ థియేట‌ర్లలో టికెట్‌పై రూ. 2 నుంచి రూ.7 కు పెంచుకునేందుకు అనుమ‌తి. నాన్ ఏసీ థియేట‌ర్లలో టికెట్‌పై రూ .2 నుంచి రూ.5 కు పెంచుకునేందుకు అంగీకరించారు. ఈ నేప‌ధ్యంలో ఆన్‌లైన్ ఛార్జీలు , జీఎస్టీ ఛార్జీల‌ను త‌ప్పనిస‌రిగా టికెట్లపై ముద్రించాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో సినీ అభిమానుల జేబుల‌కు అద‌నంగా చిల్లు ప‌డుతోంది.