Most Ancient Places in Warangal

ఓరుగల్లు పేరు వినగానే మనకి కాకతీయ కాలం నాటి శిల్ప కళా వైభవాలు గుర్తొస్తాయి.కాకతీయులు వరంగల్ చుట్టూ పక్కల ఎన్నో రకాలైన కట్టడాలను నిర్మించారు.అలనాడు కట్టిన కాకతీయ చారిత్రక కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిలో వరంగల్ కోట , వేయి స్తంభాల గుడి,రామప్ప దేవాలయాలు ప్రముఖమైనవి.

#వేయి స్తంభాల గుడి:

వేయి స్తంభాల గుడి వరంగల్ జిల్లా హన్మకొండ లో ఉంది. తెలంగాణ రాష్ట్రం లోనే కాదు దేశంలోనే ప్రసిద్ధి పొందిన కట్టడం.ఈ గుడి ప్రాచీన వైభవాన్ని , అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చెదిరి పోకుండా ఉంది.ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే తెలియని ఒక అనుభూతి కలుగుతుంది.సోపానాలు మాదిరి ఉండే మెట్లు గోడలు అద్భుతంగా ఉంటాయి.ఇది చాలా పురాతనమైన దేవాలయం.వేయి స్తంభాల గుడిని 12 వ శతాబ్దం లో కాకతీయ రాజు రుద్ర దేవుడు నిర్మించాడు. ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితమైనదే కాదు ఇక్కడ మరో విశిష్టత కూడా ఉంది అదేంటంటే ఇక్కడ ఉండే స్తంభాల పై నాణాలతో గాని ఏదైనా ఇనుము లోహం తో గాని తాకిస్తే సప్త స్వరాలు , మధురమైన సంగీతం వినిపిస్తుంది.ఈ ఆలయం లో ఎటు వైపు చూసిన అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి , వరంగల్ వెళ్తే తప్పకుండా సందర్శించే ప్రదేశం ఇది.