మోదీ అండ్ కో కొత్త స్కెచ్ ! బాబు కి చుక్కలు చూపించేస్తారట !  

అందుకే బాబు పై కక్ష తీర్చుకునేందుకు ఏపీలో మెల్లగా పాగా వేద్దాం అని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తే హోదా అనే అంశంతో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి టైం చూసి దెబ్బగొట్టిన బాబుపై బీజేపీ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. స్వయంగా మోడీనే ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన భాజపా నేతలకు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ చీఫ్ అమిత్ షా, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లు సమావేశం ఏర్పాటు చేసి చేయాల్సిన పనులు వివరిస్తున్నారట.

టీడీపీ అవినీతి భాగోతాలే కాకుండా, హోదాపై పలు మాటలు మార్చిన బాబు ద్వంద నాలుకల ధోరణిని జనాలకు చేర్చి బాబు నిజస్వరూపం బయటపెట్టే ప్రణాళికలను వారికి వివరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఏపీలో టీడీపీ ప్రభుత్వం లో జరిగిన అనేక అవకతవకలు సాక్షాధారాలతో సహా బయటపెట్టి టీడీపీని దోషిని చేయాలనీ బీజేపీ చూస్తోంది. బీజేపీ వైకిరిపై చంద్రబాబు నాయుడు పైకి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల ఆందోళన చెందుతున్నాడని బీజేపీ గ్రహించేసింది.