మోదీ అండ్ కో కొత్త స్కెచ్ ! బాబు కి చుక్కలు చూపించేస్తారట !     2018-06-20   00:54:33  IST  Bhanu C

ఏపీ సర్కారుకు చుక్కలు చూపించేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సిద్ధం అయ్యారు. ఇందుకు వారు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. నాలుగేళ్లపాటు తమతో కలిసి ఉన్న టీడీపీ బయటకు వెళ్తూ వెళ్తూ అనేక నిందలు వేసిందని, దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఏదో మోసం చేసే పార్టీ అన్నట్టు భావన కలిగేలా టీడీపీ ఆరోపణలు చేసిందని బీజేపీ లోలోపల రగిలిపోతోంది. అందుకే సరైన సమయం చూసి టీడీపీని దెబ్బకొట్టాలని చూస్తోంది.

గత ఎన్నికలలో బీజేపీతో పెట్టుకున్నటీడీపీ నాలుగేళ్లపాటు కలిసి మెలిగి ఉండి ఎన్నో ప్రయోజనాలు పొందింది. ఆ తరువాత రాజకీయ పరిస్థితులు మారడంతో కేంద్రంపై నిప్పులు చెరుగుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని బయటకి వచ్చేసింది. తమతో పొత్తును విరమించుకున్నాడని బీజేపీ నేతలకు బాధలేదు కానీ పొత్తును విరమించుకుంటూ ప్రత్యేకహోదా ఇవ్వకుండా బీజేపీ నేతలు మోసం చేసారని ప్రచారం చేసి మరీ జనాలలో బీజేపీపై ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించాడని అభిప్రాయపడుతున్నారు.