చంద్రబాబు “దీక్ష” మోడీకి “అగ్ని పరీక్ష”     2018-04-20   03:48:17  IST  Bhanu C

ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ,విభజన హామీ హక్కుల కోసం, పేద ప్రజల ముఖాలలో చిరునవ్వుకోసం మోడీ దీక్ష పూనారు..68 ఏళ్ల వయస్సు లో యువకుడినా మండుటెండలు బగ్గు మంటున్న తరుణంలో ఎంతో సాహసంగా చంద్రబాబు మొదలు పెట్టిన ఈ ధర్మ పోరాట దీక్షకి అశేష ప్రజానికం చంద్రబాబు కి మద్దతుగా నిలుస్తోంది..తన పుట్టినరోజునాడు కుటుంభంతో సరదాగా గడపకుండా రాష్ట్రం కోసం దీక్షని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు..అయితే

ఈ దీక్ష పై కేంద్రప్రభుత్వం డేగ కళ్ళతో నిఘా ఉంచింది. చోట మోట నాయకుడి దీక్ష అయితే పెద్దగా పట్టించుకోకపోదురేమో కానీ జాతీయ స్థాయి నేత కావడం తో ఈ దీక్ష చేపడుతున్నందుకు కేంద్ర పెద్దల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష 12 గంటల పాటు అంటే రాత్రి 7 వరకు కొనసాగనుంది..సర్వమత ప్రార్థనల అనంతరం చంద్రబాబు దీక్షను ప్రారంభించారు.