మోదీ చేసిన మోసం ... ఇదే జనాగ్రహం !     2018-05-26   04:51:47  IST  Bhanu C

అంతన్నాడు .. ఇంతన్నాడు.. అరచేతిలో స్వర్గం చూపించాడు..చివరికి వచ్చేసరికి జనం చేతిలో చిప్ప పెట్టే పరిస్థితికి వచ్చాడు. గత ఎన్నికల ముందు నమో నమో అంటూ జపం చేసిన జనాలను వెర్రి వెంగళప్పలు చేసి సామాన్యుడు ఈ దేశంలో బతకలేని పరిస్థికి తీసుకొచ్చేసాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ! ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీలు మాములుగా లేవు కదా ! ఇవన్నీ ఎందుకు రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేసి ప్రజలను కష్టాలపాలు చేసాడు. పై పెచ్చు ఇదంతా మీకోసమే చేశాను. నల్లధనం బయటకి వచ్చేస్తుంది మీ అందరి అకౌంట్లో డబ్బులు వేసేస్తా అంటూ ఊదరగొట్టేసాడు. చివరికి ఏం చేసాడు ..? ఏమీ చెయ్యలేదు.

నరేంద్రమోదీ మీద జనాలు నమ్మకం కోల్పోయారు. అందుకే ఆయనకు ఉన్న క్రేజ్ బాగా తగ్గిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోంది. కేంద్రంలో అధికార పీఠం దక్కించుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉత్సాహం కన్పించింది. దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో గుణాత్మక మార్పు తేవడమే తన జీవిత లక్ష్యమనే వాగ్దానం చేసేసాడు మోదీ. నాలుగు సంవత్సరాలు దాటింది ఎక్కడి పరిస్థితులు అక్కడే ఉన్నాయి. మోడీ మాటలకు మోసపోయామా అన్న భావన జనాల్లో పెరుగుతోంది.