Mla Roja Harsh Comments on Two Ap Ministers

ఇక దేశ‌వ్యాప్తంగా న‌లుగురు మంత్రుల‌పై లైంగీక ఆరోప‌ణ‌లు ఉంటే అందులో ఇద్ద‌రు మంత్రులు ఏపీలోనే ఉన్నార‌ని, ఇలాంటి వారిని బాబు త‌న కేబినెట్‌లో ఉంచుకుని వెన‌కేసుకు రావ‌డం దారుణ‌మ‌ని ఆమె విమ‌ర్శించింది. చంద్ర‌బాబు పాల‌న‌లో ప‌ట్ట‌ప‌గ‌లే మ‌హిళ‌లు రోడ్ల‌మీద‌కు రావ‌డానికి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని కూడా ఆమె విమ‌ర్శించారు.

రాష్ట్రంలో టీడీపీ పాల‌న‌ను ఆమె బాహుబ‌లి సినిమాలోని కాల‌కేయుల పాల‌న‌తో పోల్చారు. తందుర్రులో మెగా అక్వాఫుడ్ పార్క్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతోన్న మ‌హిళ‌ల బ‌ట్టలు చించి కొట్టిన పోలీసులు, ఎస్టీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు మెస్‌ చార్జీలు పెంచమని విశాఖలో పోరాడితే జుట్టు పట్టి లాగుతుంటే ప్ర‌భుత్వం చోద్యం చూస్తోంద‌ని ఆమె విమ‌ర్శించారు.

ఇక విజయవాడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌తో బెదిరించి ఎంతో మంది అమాయక మహిళలను వ్యభిచారంలోకి దించినా నిందితుల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని రోజా బాబు స‌ర్కార్‌ను ఓ ఆటాడుకున్నారు. ఇక రోజా ఇద్ద‌రు ఏపీ మంత్రుల‌పై చేసిన లైంగీక ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రా ? అని ఇప్పుడు ఒక్క‌టే చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్నాయి.