అయ్యో రోజా ! నీ పరిస్థితి ఇంత దారుణమా ..?     2018-05-20   00:42:43  IST  Bhanu C

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పినా.. ఆ పార్టీ నుంచి ప్రత్యర్థి పార్టీల మీద విమర్శల బాణాలు వదలాలి అన్నా ముందుగా రంగంలోకి దిగేది నగరి ఎమ్యెల్యే రోజ. ఆమెకు పార్టీలో కూడా ఎప్పుడు పెద్ద పీటే వేస్తూ వస్తున్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాలు . ఒక విధమైన సెంటిమెంట్ కారణంగా ఆమెకు క్రమక్రమంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు కొంతకాలంగా అధినేత జగన్ కూడా ఆమెను ప్రోత్సహించేందుకు పెద్దగా ఇష్టపడడంలేదని పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నాయి.

వైసీపీ ప్రత్యర్థి పార్టీలు అన్ని ఆమె మీద ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేసారు. ఎందుకంటే ఆమె ఉన్న పార్టీ గెలిచినా ఆమె గెలవదు ఆమె గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు. చివరకి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైకాపాలో చేరి వైసీపీలో తానే వాగ్దాటి కలిగిన నాయకురాలు అనుకుని నోటిదురుసుగా ఏమి మాట్లాడుతుందో కూడా విచక్షణ లేనంతగా అధికార పార్టీపై దుమ్మెత్తిపోసేది. ఇదంతా ఇప్పుడు వైసీపీకి పెద్ద మైనెస్ గా మారింది అని జగన్ బలంగా నమ్ముతున్నాడట.

అలాగే ఆమె ఆర్ధికంగా కూడా కొంచెం బలహీనపడినట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెకు ఏ సరి టికెట్ ఇచ్చే విషయంలో ఆచితూచి స్పందించాలని అధినేత భావిస్తున్నాడు. ఆమె సినిమాల్లో సంపాదించిన డబ్బంతా ఎన్నికల్లో ఖర్చుచేయటంతో ఇప్పుడు కేవలం బుల్లితెర షోల మీద వచ్చిన సొమ్ముతో గడుపుతోంది. . కొద్దిరోజులుగా జబర్దస్త్‌లో కూడా కనిపించటలేదు దానికి కారణం సినిమా షూటంగ్‌లో బిజీగా ఉన్నానంటూ చెబుతున్నా. వాస్తవానికి ఆమెకు జబర్దస్త్‌తో ఎంత పాపులారిటీ వచ్చిందో అంతే మైనస్ ప్రజల్లోకి వెళ్ళింది.

గోరు చుట్టుమీద రోకలి పోతూ అన్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో రోజ నోటి దురుసు వల్ల పార్టీకి మంచి జరగకపోగా .. నష్టమే ఎక్కువ జరుగుతోందని నివేదిక ఇచ్చాడట. దాంతో నీ నోటి దురుసుతనం వల్లనే పార్టీ పరువు పోయిందంటూ జగన్ మండిపడినట్లు పార్టీవర్గాల్లో అంతర్గతంగా సాగుతున్న చర్చ.

అదీ కాకుండా ఇటీవల ముద్దుకృష్ణమనాయుడు మరణంతో నగరిలో సెంటిమెంట్ ఆ ఫ్యామిలీకు సానుభూతి పెరిగింది. దీంతో ఇక్కడ ముద్దుకృష్ణమనాయుడు తనయుడు బరిలోకి దిగే అవకాశాలన్నాయి. దీనికి తోడు రోజ మీద నగరి ప్రజలు కూడా అసహనంగా ఉన్నట్టు జగన్ దృష్టికి రావడంతో ఈ సారి అక్కడ ఇంకొకరికి అవకాశం ఇస్తే బాగుంటుందని , అందుకే రోజాకు ఇక టికెట్ ఇచ్చేది లేదని పార్టీ ముఖ్య నాయకులతో జగన్ అన్నట్టు సమాచారం. పోనీ ఆమె ఏదైనా పార్టీలోకి వెళ్తుందా అంటే ఆమెకు ఉన్న ఐరెన్ లెగ్ సెంటిమెంట్ కారణంగా ఆమెను చేర్చుకునేందుకు ఏ ఒక్క పార్టీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఆమెకు టికెట్ ఇచ్చినా .. ఇవ్వకపోయినా ఆ పార్టీలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఆమెది.