ఈ రాశుల వారిలో ఉన్న స్పెషల్ తెలిస్తే ఆశ్చర్యపోతారు    2018-03-26   02:02:39  IST  Raghu V

ఈ రోజుల్లో జాతకాలను నమ్మేవారు చాలా మంది ఉన్నారు. సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు,రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా చెప్పుకుంటూ పొతే జాతకాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి గ్రహాల అనుగ్రహంతోనే మన జీవితం ముందుకు సాగుతుందని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు. మనం పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం,రాశి అనేది ఏమిటో చెప్పి మన భవిష్యత్ గురించి చెప్పుతూ ఉంటారు.

జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనేవి ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. అయినా సరే మనిషి తన జీవితం మీద ఎన్నో ఆశలను పెట్టుకుంటాడు. అలాగే భవిష్యత్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.

సాధారణంగా మంచి అయినా చెడు అయినా జరిగిపోయిన తర్వాత మాత్రమే దాని గురించి ఆలోచించటం, బాధపడటం,ఆనందపడటం వంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే రెండు రాసులవారికి మాత్రం భవిష్యత్ లో జరగబోయే విషయాలు ముందుగానే తెలిసిపోతాయట. ఆ రాశులు మకరరాశి,మిధున రాశి.