సంచలనం సృష్టించిన..మిస్టర్ దళిత్ వెనుక ఎవరున్నారో తెలుసా    2017-10-07   05:45:35  IST  Raghu V

సోషల్ మీడియాలో సంచలన రేకెత్తించిన అంశం “ మిస్టర్ దళిత్ “ ఒక్క ఫోటో..దానిలో మెలితిప్పిన మీసం..ఇది ఒక ఉద్యమంలా సాగిపోయింది..అందరి దళిత్ ని సపోర్ట్ చేసే చాలా మంది ప్రొఫైల్ పిక్స్ ఈ ఫోటో లతో నిండి పోయాయి.ఏమి జరుగుతోంది..అసలు ఎవరు దళిత్ అనేది పెద్ద టాపిక్ అయ్యింది. అందరూ దీనికి ఏమిటి కారణం అని ఊహిస్తున్న తరుణంలో ఈ ఉదంతానికి కారణమైన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అతను చెప్పే విషయాలు విని పోలేసులు షాక్ కి గురయ్యారు .అసలు విషయాలలోకి వెళ్తే.

సంచలనం సృశించిన ఈ విషయంలో అసలు సూత్రధారి గాంధీ నగర్ కు చెందిన దిగంత్ మహేరియా.సోషల్ మీడియా..వాట్సప్ ఇలా ఎక్కడ చూసినా చాలా మంది ఈ మీసం మేలిసిఉన్న ఫోటోని ప్రొఫైల్ ఫోటో గా పెట్టుకోవడం తో ఈ ఫోటో వార్తల్లో ఒక అంశం అయ్యింది.అసలు ఈ మీసం ఫోటో కి ..దిగంత్ మహేరియా కి సంభందం ఏమిటి ఎవరు ఇతను..అసలు ఏమి జరిగింది.ఈ ఫోటోలు ఇలా ఎందుకు హల్చల్ చేస్తున్నాయి.. అనే వివరాలలోకి వెళ్తే. 17 ఏళ్ల దిగంత్ మహేరియా అనే యువకుడు గాంధీనగర్ కు చెందిన వ్యక్తి. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా సదరు యువకుడు దారుణమైన నాటకాన్ని ఆడినట్లుగా పోలీసులు గుర్తించారు.