2019లో టికెట్స్ కోల్పోనున్న మంత్రుల లిస్టు ఇదే     2017-10-10   03:09:49  IST  Bhanu C

Ministers List Who aren’t Getting 2019 Tickets

అంతుబట్టని వ్యూహాలు వేయడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అనడంలో సందేహం లేదు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరు చూడటం లేదు అనుకుంటుంది అన్నట్టుగా..ఏపీలో మంత్రులు,ఎమ్మెల్యేలు తీరు ఉంది..దానికి నిదర్సనంగా చంద్రబాబు సర్వేలు ఉన్నాయట. ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటూ..సర్వేకి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ..ఉండే చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది..దానికి కారణం ఆ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ ప్రజలలో వ్యతిరేకత మూటకట్టుకోవడమే. అంతేకాదు ఇన్‌చార్జ్‌ల‌కు ఇప్ప‌టికే టిక్కెట్ రాద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

అయితే ప్రస్తుతం చంద్రబాబు సేనియర్స్ కి పెద్ద షాక్ ఇస్తున్నాడట..ఏమిటంటే వయసుమళ్ళిన వారిని పక్కకి తప్పించి యువకులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు..అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కొందరు మంత్రులకి కూడా టికెట్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్న టాక్ వినపడుతోంది. కొందరికి టికెట్స్ ఇవ్వకపోవడం..మరికొందరికి నియోజకవర్గాల మార్పు ఇలాంటి పరిణామాలు జరగనున్నాయి అని తెలుస్తోంది. టికెట్స్ రానివారిలో ముందు పేరు ఆళ్లగడ్డ ఆడబిడ్డ భుమా అఖిలప్రియ పేరు వినిపిస్తోంది. నంద్యాల నుంచి భూమా రైట్ హ్యాండ్ ఏవి.సుబ్బారెడ్డిని రంగంలోకి దించి, అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఆళ్ల‌గ‌డ్డ నుంచి బ‌రిలోకి దింపుతార‌ని తెలుస్తోంది.