పాలిటిక్స్ కి అధికారపక్ష మంత్రి గుడ్ బై..రీజన్ ఎవరో తెలుసా  

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారు హయాం నుంచీ టిడీపిని అంటిపెట్టుకుని ఉన్న నేత ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై సీఎం చంద్రబాబు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారని ..సీనియర్ నాయకుడైన ఆయనని అస్సలు పట్టించుకోవడం లేదని..ఆయన ప్రాభల్యం తగ్గించేలా స్కెచ్ లు వేసున్నారని..ఎంతో సీనియర్ నాయకుడిని అయిన నన్ను డమ్మీ చేస్తునారని కేఈ.కృష్ణమూర్తి స్వయంగా తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని టాక్. చంద్రబాబు నాయుడు తరువాత ప్లేస్ లో ఉన్న కృష్ణమూర్తి ఈ విషయంలో పూర్తి అసహనంలో ఉన్నారని తెలుస్తోంది.రెవెన్యూ మంత్రిగా ఉన్న కేఈని కాదని బాబు త‌న‌కు న‌మ్మక‌స్తుడు అయిన పుర‌పాల‌క శాఖా మంత్రి నారాయ‌ణ‌కు కీల‌క‌మైన సీఆర్‌డీఏ బాధ్యత‌ల‌ను అప్పగించారు. కేఈ కి తెలియకుండానే ఆయన శాఖలో బ‌దిలీలు జ‌రిగిపోయేలా ప్రభుత్వం గ‌తంలో తెచ్చిన ఆర్డినెన్స్ కూడా కేఈని బాబు ఎలా లైట్ తీస్కొంటున్నారో అంద‌రికి తెలిసేలా చేసింది. నాడు లోకేష్ ఒత్తిడి తెచ్చి మ‌రీ కేఈ ఆర్డీవోల‌ను బ‌దిలీ చేస్తే వాటిని ర‌ద్దు చేసేలా డెసిష‌న్ తీసుకున్నార‌న్నది కూడా ఓపెన్ సీక్రెట్టే. ఇలా బాబు వ‌ద్ద ఎన్నోసార్లు అవ‌మానాల‌కు గుర‌వుతూ వ‌స్తోన్న కేఈ ఇప్పుడు బాబు వ‌ద్ద త‌న అవ‌మానాల‌పై త‌న స‌న్నిహితుల ముందు ఓపెన్ అయిపోతున్నార‌ట‌.