మేష రాశివారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు    2018-04-19   01:10:26  IST 

మేష రాశి వారిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే వీరు కూడా అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడటమే కాకుండా వారి సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఆత్మ విశ్వాసం తక్కువగా ఉన్నవారు మేష రాశి వారిని తట్టుకోవటం చాలా కష్టం. మేష రాశి వారికీ జాతక రిత్యా కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. వీరిపై కుజ గ్రహ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవేశం,ఆత్మవిశ్వాసం బాగా ఎక్కువగా ఉండుట వలన ఆత్మ విశ్వాసం తక్కువ ఉన్నవారు వివాహం చేసుకుంటే మేష రాశి వారిని చూసి భయపడిపోతారు.

మేష రాశి వారు కాస్త సొంత ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మేష రాశి వారు ఏమి మాట్లాడిన వారిని అన్వయించుకొని మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఆ గొప్పను జీవిత భాగస్వామి అర్ధం చేసుకోకపోతే చాలా కష్టం. ఇలా అర్ధం చేసుకోకపోతే వారి మధ్య అపార్ధాలు చోటు చేసుకుంటాయి.