మెర్సల్ తెలుగులోకి ఇక రాదు, కారణం పవన్ మరియు అల్లు వారు  

తమిళ చిత్రం తమిళనాట విజయ దుందుభి మోగిస్తోంది. తలపతి విజయ్ ముఖ్యపాత్ర లో అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించి రజనీకాంత్ రికార్డులను, తమిళంలో బాహుబలి సృష్టించిన రికార్డులని ఛాలెంజ్ చేస్తోంది. ఇంతటి సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాని తెలుగులోకి “అదిరింది” పేరుతో అనువాదం చేసి విడుదల చేయాలని ప్రయత్నాలు చేసారు. కాని ఆ యత్నాలు, విఫలయత్నాలుగానే మిగిలిపోయాయి. కారణాలు తెలియవు కాని, అదిరింది విడుదల పూర్తిగా ఆగిపోయింది.

తాజా సమాచారం ప్రకారం, మెర్సల్ హక్కులని గీతా ఆర్ట్స్ సంస్థ భారి మొత్తం చెల్లించి చేజిక్కించుకుందట. ఈ చిత్రం యొక్క అనువాద హక్కులు నిర్మాత శరత్ మరార్ దగ్గర ఉండటం విశేషం. అందువల్ల, శరత్ మరార్ కి కట్టిన డబ్బు వాపస్ ఇస్తారు. ఈ డీల్ ఇలా సవ్యంగా సాగడానికి కారణం పవన్ కళ్యాణ్ అంట. శరత్ మరార్ పవన్ కళ్యాణ్ కి ఆప్తమిత్రుడు కదా. మరి పవన్ ఈ డీల్ ఎందుకు చేయించినట్లు?

బ్లాక్బస్టర్ సినిమా మీద పవర్ స్టార్ కన్నేశాడట. ఈ విషయాన్ని తెలుగుస్టాప్ఇంతకుముందే తెలుగు స్టాప్ ఇంతకుముందే ఓసారి రిపోర్ట్ చేసింది. మరి రీమేక్ హక్కులు కొనుక్కున్న గీతా ఆర్ట్స్, ఈ చిత్రాన్ని ఎవరితో నిర్మిస్తుంది? అల్లు అర్జున్ తోనా, లేక పవన్ కళ్యాణ్ తోనా? ఈ ఇద్దరు కాకుండా రామ్ చరణ్ తోనా?