ఆ పని చేయగల మగవారు దొరికితే వెంటనే పెళ్ళి చేసుకుంటామంటున్న అమ్మాయిలు     2018-03-03   21:49:47  IST  Raghu V

Men who can cook are sexy and romantic – survey

ఓ స్త్రీ తన భర్త నుంచి ఏం కోరుకుంటుంది? ప్రేమ, ఆప్యాయత లాంటి పదాలు వాడటం చాలా కామన్. మోడ్రన్ అమ్మాయిలైతే మరో అడుగు ముందుకేసి ఫిజిక్ కావాలి అంటుంది, సంపాదన కావాలి అంటుంది, సెక్స్ లో ఎక్కువసేపు నిలువగలిగే వాడు కావాలంటుంది. కాని ఇవి మాత్రమే కాదు, ఒక అబ్బాయి తన వరుడైతే బాగుండు అనే కోరిక కల్పించే మరో క్వాలిటీ కూడా ఉందట. ఆ క్వాలిటి ప్రతి మగవాడిలో కోరుకుంటారట అమ్మాయిలు. అబ్బాయిలు ఊహించలేని ఆ క్వాలిటి ఏంటో తెలుసా ? “వంట వండటం”.

వినడానికి వింతగా అనిపించినా, ఇదే నిజమని అంటున్నారు ఢిల్లీ అమ్మాయిలు. వంట చేయగల మగవారు సెక్సిగా అనపిస్తారట. చిత్రమైన విషయం ఏమింటే ఇలాంటి కోరికలు కేవలం ఇండియన్ అమ్మాయిలకి మాత్రమే లేవు, మొన్నామధ్య అమెరిక్ అమ్మాయిలు కూడా ఓ సర్వేలో ఈ విషయాన్ని చెప్పారు. వారి పాయింట్ ఏంటంటే, భాగస్వామి అన్నప్పుడు అన్ని విషయాలు పంచుకోవాలి. ఈ కాలంలో భాగస్వాములిద్దరు సంపాదిస్తున్నారు .. ఇద్దరు ఆఫీసుల్లో అదే శ్రమపడుతున్నారు .. అలా ఇంటి బాధ్యతలు ఇద్దరు పంచుకున్నప్పుడు వంట మాత్రం కేవలం భార్యే ఎందుకు చేయాలి?

ఈ ఈగో విషయాలు ఏమో కాని, వంట వచ్చిన అబ్బాయిలు రొమాంటిక్ గా ఉంటారంటోంది సర్వేలో పాల్గొన్న ఓ అమ్మాయి. అదెలా అంటే .. “నేను ఉదయాన్నే లేచేసరికి నా చేతిలో నా భర్త కాఫీ పెడితే ఎంత బాగుంటుంది? వంట గదిలో నేను వంట చేస్తోంటే .. తను ఊరికే టీవీ చూస్తూ కూర్చోకుండా, నాకు కూరగాయలు కోసిపెడితే నా మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుంది? ఆఫీసు నుంచి ఒకరోజు నేను ఆలస్యంగా రావచ్చు, ఒకరోజు తను ఆలస్యంగా రావొచ్చు .. నేను ఆలస్యంగా వచ్చిన రోజు, నేను వచ్చే సమయానికే వంట రేడిగా ఉండి, ఇద్దరు కబుర్లు పెట్టుకుంటూ తింటే, అసలు గొడవ అనేది ఉంటుందా? అంతమాత్రామే కాదు, ఎందుకు తెలియదు .. బెడ్ రూమ్ లో జరిగే శృంగారం కన్నా, వంటగదుల్లో చేసే చిలిపిచేష్టలు, పెట్టే కబుర్లు మరింత క్యూట్ గా, సెక్సిగా అనిపిస్తాయి .. కాబట్టీ వండగలిగే భర్త ఉండటం అదృష్టం. పూర్తి పని తను చేయనక్కరలేదు .. నాకు వంటలో సహాయం చేసినా .. అదే రొమాంటిక్ గా ఉంటుంది” అంటూ అభిప్రాయపడింది ఇంకా పెళ్ళి కాని ఓ అమ్మాయి.

విన్నారా అబ్బాయిలు ? పెళ్ళి కాని అమ్మాయిలు కూడా తమ కాబోయే భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ ఎన్ని అంచనాలు పెట్టుకుంటున్నారో! కాలానికి తగ్గట్టు మారితేనే మంచిది. ఇప్పుడు ఉన్న ఖర్చులకి ఇద్దరు భాగస్వాములు పనిచేస్తేనే మహానగరాల్లో ఇల్లు గడుస్తోంది. అలాంటప్పుడు ఆఫీసు పని, ఇంటి పని .. రెండు అంటే ఆమె మీద ఎంత ఒత్తిడి ఉంటుంది? కాబట్టి ఇంట్లో అమెకు సహాయపడే భర్త ఉంటే అదో ధైర్యం, సంతోషం. వంట నేర్చుకోండి, అది చిన్న పని కాదు. అయినా, వంటని చిన్నచూపు చూడాల్సిన అవసరం ఏముంది ? పెద్ద పెద్ద హోటల్స్ లో వండేది మగవారేగా?