చికాగో సెక్స్‌ రాకెట్‌.. మెహ్రీన్‌ బలి     2018-07-03   04:50:50  IST  Raghu V

అమెరికాలో తెలుగు వెండి తెర, బుల్లి తెర స్టార్స్‌ వ్యభిచారం సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. కిషన్‌ అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు నటీమణులతో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆ వ్యక్తి వ్యభిచారం చేయించిన విధానం తెలిసి పోలీసులే అవాక్కవుతున్నారు. పదుల సంఖ్యలో టాలీవుడ్‌ హీరోయిన్స్‌ పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ సమయంలోనే మెహ్రీన్‌ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ పెట్టి బుక్‌ అయ్యింది. తన కుటుంబ సభ్యులతో అమెరికాకు వెళ్లిన సమయంలో అక్కడ పోలీసులు తనను అడ్డుకున్నట్లుగా మెహ్రీన్‌ ట్విట్టర్‌లో పేర్కొంది.

ప్రస్తుతం తెలుగు సినిమా హీరోయిన్స్‌పై అమెరికాలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారని, అందుకే తాను హీరోయిన్‌ అని చెప్పగానే వారు నా గురించి విచారణ జరిపారు, అమెరికా ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. తాను అదే సమయంలో వారి ద్వారా సెక్స్‌ రాకెట్‌ గురించి తెలుసుకున్నాను. నన్ను ప్రశ్నించిన అధికారులు నా గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత క్షమాపణలు చెప్పి పంపించారు అంటూ గతంలో ట్విట్టర్‌లో మెహ్రీన్‌ పోస్ట్‌ చేసింది. అయితే ఆ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించారు. ప్రముఖ జాతీయ దిన పత్రికలో తాజాగా ఆ విషయమై కథనం రావడం జరిగింది.