యూఎస్‌ సెక్స్‌ రాకెట్‌.. మెహరీన్‌కు సంబంధం ఏంటీ?     2018-06-18   00:52:49  IST  Raghu V

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న చికాగో టాలీవుడ్‌ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒకరి పేరు దాదాపుగా బయటకు వచ్చేసింది. మెగా హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌ అనగానే ఆమె పేరును అంతా గుర్తిస్తున్నారు. ఇక త్వరలోనే మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ పేర్లు కూడా బయటకు వస్తాయనే ప్రచారం సినీవర్గాల్లో జరుగుతుంది. అమెరికా పోలీసులు ప్రస్తుతం ఆ హీరోయిన్స్‌ను ఫోన్‌ ద్వారా విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని ఆ హీరోయిన్స్‌ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లి పోయినట్లుగా తెలుస్తోంది.

మరో వైపు అమెరికాకు షూటింగ్‌ నిమిత్తం లేదా ఇతరత్ర అవసరాల నిమిత్తం, వ్యక్తిగత కారణాల నిమిత్తం అమెరికాకు వెళ్తున్న తెలుగు హీరోయిన్స్‌కు మరియు ఇతర సౌత్‌ హీరోయిన్స్‌కు అక్కడ కష్టాలు ఎదురవుతున్నాయి. ఇండియా నుండి వస్తున్నాను, హీరోయిన్‌ను అంటే అక్కడ ఇమిగ్రేషన్‌ అధికారులు కళ్లల్లో బూతద్దాలు పెట్టుకుని మరీ వారిని ఎంక్వౌరీ చేసి మరియు వారికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకుని మరీ వదిలేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రస్తుతం హీరోయిన్స్‌కు ఇబ్బందికరంగా దాపరించాయి.