అన్నయ్య టైం స్టార్ట్ ! జనసేన లో మెరవబోతున్న మెగాస్టార్     2018-09-14   09:27:45  IST  Sai M

ఎప్పుడా ఎప్పుడా అంటూ ఊరిస్తూ వస్తున్న టైం దగ్గరకు వచ్చేసింది. తమ్ముడు పెట్టిన పార్టీలోకి అన్నయ్య పరకాయ ప్రవేశం చేయబోయే సమయం దగ్గర్లోనే ఉంది. రాజకీయంగా ఇప్పుడు కీలక సమయం కావడంతోపాటు … జనసేనకు ఏపీలో అవకాశాలు మెరుగుగా ఉండడంతో… ఈ సమయంలో ‘మెగా పవర్’ తోడయితే రాజకీయంగా అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్టు జనసేన వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో చిరు కూడా సానుకూలంగా ఉండడంతో పవన్ లో ఎదో తెలియని సంతోషం కనిపిస్తోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే మెగా అభిమానులను జనసేనలోనికి పంపిన మెగాస్టార్ తాను కూడా జనసేన స్క్రీన్ పై కనిపించేందుకు తహతహలాడుతున్నారు.

Jana Sena Party,Megastar Chiranjeevi,Pawan Kalyan

ఇప్పటివరకు జనసేన స్క్రీన్ పై పవన్ కల్యాణ్ మాత్రమే కనిపించేవారు. కాని ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలను వివిధ రంగాలకు చెందిన నిపుణులను పార్టీలోకి ఆహ్వానించి జెండా కప్పేస్తున్నారు. మొన్నటి దాకా కుటుంబం నుంచి జనసేనకు ఎటువంటి మద్దతు లభించలేదు. అయితే తాజాగా మెగా కుటుంబం మొత్తం జనసేనాని పవన్ వెనక మేమున్నమంటూ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులను జనసేన పార్టీలోకి పంపారు మెగా స్టార్ చిరంజీవి. రానున్న కాలంలో చిరంజీవి కూడా తమ్ముడి పార్టీలో కీ రోల్ ప్లే చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Jana Sena Party,Megastar Chiranjeevi,Pawan Kalyan

గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కొన్ని కొన్ని తప్పటడుగులు వేయడంతో పాటు… పార్టీలో చేరినవారందరిని గుడ్డిగా నమ్మేశాడు. కానీ ఆ నమ్మకమే ఆయనకు శాపంగా మారి ఎన్నికల్లో దెబ్బకొట్టింది. అయితే చిరుకి రాజకీయంగా ఓటమి ఎదురయినా అయినా ఫ్యాన్స్ మాత్రం ఆయనకు దూరం కాలేదు. ప్రస్తుతం చిరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీలో ఉన్నా… లేనట్టుగానే ఉన్నాడు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తమ్ముడు పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు.

పవన్ కూడా తన అన్నయ్య జనసేనలోకి ఎంత తొందరగా వస్తే… అంత మంచిది అన్న కోణంలో ఉన్నాడు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓటమికి ఒక వర్గం మీడియా కూడా కారణం అని.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో జనసేన శతాగ్ని టీమ్ బాగా యాక్టివ్ గా ఉండడంతో.. పార్టీపై ఎటువంటి తప్పుడు కధనాలు వచ్చినా తిప్పికొట్టి వాస్తవాలేంటో ప్రజలకు వివరించగలుగుతున్నారు. చిరంజీవి జనసేనలో చేరడం లాంఛనమే అయినా … ఆయనకు పార్టీ లో ఏ హోదా కట్టబెడతారు అనేది మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన అన్న ఎంత తొందరగా పార్టీలో చేరతాడా అని ఎదురుచూపులు చూస్తున్నాడు.