Megastar Proves Stamina With His Movie Satellite Rights

మెగాస్టార్ మూవీ వస్తుంది అంటే మెగా అభిమానుల్లో పండుగ వాతారవరణమే అని చెప్పాలి. దాదాపు 9 ఏళ్లుగా మెగా మూవీ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి ఆ కోరిక తీర్చుకోబోతున్నారు. అయితే 9 ఏళ్ల తర్వాత సినిమా తీస్తున్న మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో చేస్తుంటే శాటిలైట్స్ రూపంలో కూడా మిగతా హీరోలకు షాక్ ఇచ్చేలా అమ్ముడయ్యాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఖైది నెంబర్ 150 శాటిలైట్ రైట్స్ ఏకంగా 14 కోట్ల భారీ మొత్తానికి కొనేశారట మా టివి వారు.

చిరు స్టామినా ఇది అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇక జీ తెలుగు వారు కూడా ఖైది శాటిలైట్ రైట్స్ కోసం 12 కోట్ల దాకా వచ్చారట. ఫైనల్ గా మా టివి వాటిని సొంతం చేసుకుంది. ఇప్పటికే చిరు మీలో ఎవరు కోటిశ్వరుడు నాలుగో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆ అనుబంధంతోనే సినిమాను కూడా కొనేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా అదరగొడుతున్న చిరు మూవీ హిట్ అయితే మాత్రం సంచలన విజయం అందుకోవడం ఖాయమనిపిస్తుంది.