మెగా హీరోల ఎంట్రీకి కొత్త ఫార్ములా     2018-05-05   02:09:33  IST  Raghu V

మెగా ఫ్యామిలీ నుండి లెక్కలేనంత మంది హీరోలు వరుసగా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు మెగా ఫ్యామిలీలో ఉన్నారు. అదే దారిలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆయన హీరోగా ఇప్పటికే రాకేష్‌ శశి అనే దర్శకుడు ఒక చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఇదే సంవత్సరం అక్టోబర్‌ లేదా నవంబర్‌లో కళ్యాణ్‌ మూవీ విడుదల చేయబోతున్నారు. కళ్యాణ్‌ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్టవ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన రెండు సంవత్సరాలుగా నటన మరియు ఇతర అంశాలపై శిక్షణ తీసుకుంటున్నాడు.

మెగాస్టార్‌ మేనల్లుడు అయిన వైష్ణవ్‌ హీరోగా అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమాకు రంగం సిద్దం అయ్యింది. మెగా హీరోలకున్న పేరు మరియు పరపతితో స్టార్‌ దర్శకు దర్శకత్వంలో, భారీ బడ్జెట్‌తో సినిమాలు చేయగలరు. కాని అందరు కూడా స్టార్‌ దర్శకుల ద్వారా పరిచయం అయితే వారికి వెంటనే స్టార్‌డం రావడం, ఆ తర్వాత వారు చేసే సినిమాలు ఆకట్టుకోక పోవడం జరుగుతున్నాయి. అందుకే మొదట చిన్న చిత్రాలు, చిన్న దర్శకులతో చేసి ఆ తర్వాత పెద్ద చిత్రాలను పెద్ద దర్శకులతో చేయాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించింది. అందుకే ఇలా కొత్త దర్శకుతో, చిన్న దర్శకులతో మంచి కథలు ఎంపిక చేసి కళ్యాణ్‌ మరియు వైష్ణవ్‌ను పరిచయం చేస్తున్నారు.