మెగా ఫ్యామిలీ వేసిన ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యేనా?     2018-04-26   06:07:26  IST  Raghu V

గతంలో ఎప్పుడు లేని పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్‌లో నెకొంది. కాస్టింగ్‌ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన వ్యవహారం బడా సినీ ప్రముఖులు కూడా స్పందించే వరకు వచ్చింది. మీడియాపై సినిమా పరిశ్రమ యుద్దం ప్రకటించే వరకు వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి విషయమై మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. సినిమా పరిశ్రమ పరువు తీసే విధంగా సినిమా వారిపై దారుణమైన కథనాలు అల్లుతూ న్యూస్‌ ఛానెల్స్‌లో కథనాలు ప్రసారం అయ్యాయి. వాటికి వ్యతిరేకంగా ప్రస్తుతం సినిమా పరిశ్రమ ప్రముఖులు నడుం భిగించారు.

కొన్ని న్యూస్‌ ఛానెల్స్‌ మొదటి నుండి కూడా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కథనాలు రాస్తూ వచ్చింది. అప్పట్లో చిరంజీవి కూతురు ప్రేమ వ్యవహారం నుండి నిన్న మొన్నటి శ్రీరెడ్డి వ్యాఖ్యల వరకు మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ మీడియా సంస్థలు వార్తలు ప్రస్తారం చేస్తూ వస్తున్నాయి. ఈ కారణంగానే కొన్ని మీడియా సంస్థలను బ్యాన్‌ చేయాలని మెగా ఫ్యామిలీ మొదటి నుండి కోరుతూ వస్తుంది. తాజాగా పవన్‌ తన తల్లిపై చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా ఛానెల్స్‌ పదే పదే ప్రసారం చేయడం దారుణం అంటూ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆందోళనకు దిగాడు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో పవన్‌ ఆందోళన చేయడం వల్ల సినిమా పరిశ్రమ అంతా కదిలింది.