జ‌న‌సేనలోకి మెగా ఫ్యామిలీ.. టీడీపీ, వైసీపీల ప‌రిస్థితి ఏంటి?     2018-05-26   00:51:06  IST  Bhanu C

మ‌రో ఏడాదిలోనే ఏపీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అధికార టీడీపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి ఎన్నికై చ‌రిత్ర సృష్టించాల‌ని చంద్ర‌బాబు, అదే ఎన్నిక‌ల ద్వారా ఇప్పుడైనా అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్‌.. తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ధ‌ర్మ‌పోరాట దీక్ష స‌భల పేరుతో చంద్ర‌బాబు ఏకంగా ఎన్నికల ప్ర‌చారం చేసేస్తున్నారు. ఇక‌, జ‌గ‌న్ మ‌రింత ముందు చూపుతో.. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హిస్తూ.. ప‌రోక్షంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే, వీరికి సినీ గ్లామ‌ర్ అనుకున్న స్థాయిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ ఒకే ఒక్క‌డు అన్న‌ట్టుగా బాల‌కృష్ణ ఉన్నా.. ఆయ‌న పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేసే అవ‌కాశం త‌క్కువే. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమా షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీ రోజా త‌ప్ప ఎవ‌రూ లేరు. ఆమె ప్ర‌చారం కూడా అంతంత మాత్ర‌మే. దీంతో ఈ రెం డు పార్టీల‌కూ సినీ గ్లామ‌ర్ పెద్ద‌గా ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సినీ గ్లామ‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యా ణ్‌ను వాడుకున్న సంగ‌తి తెలిసింది.