జనసేన ఎన్నికల్ ప్రచారానికి సై అంటున్న..యాంగ్ హీరోస్.?     2018-04-18   03:23:34  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయా పార్టీ పెట్టి ఐదేళ్ళు అవుతున్నా సరే పత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటోంది మాత్రం 2019 ఎన్నికల నుంచీ అయితే..పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎవరి పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాను అని తెలిపాడో ఆక్షనం అధికార పార్టీ టిడిపి ,ప్రతిపక్ష పార్టీ వైసీపి కూడా పవన్ తో చెలిమి కోసం ఎంతో ప్రయత్నం చేశాయి..అయితే పవన్ కళ్యాణ్ జగన్ అవినీతి పరుడు అంటూ తీవ్రమైన విమర్శలు చేయడంతో ఇక వైసీపికి పవన్ కి పొత్తు ఆలోచనే ఎవరు చేయలేదు అదే సందర్భంలో గుంటూరు సభలో పవన్ కళ్యాణ్ వైసీపి ని విడిచి పూర్తిగా చంద్రబాబు అవినీతి లోకేష్ అవినీతిపై మాట్లాడటం మొదలు పెట్టాడు ఆ సమయంలోనే వైసీపి ని ఒక్క మాట కూడా అనలేదు..

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడి జరుగుతోంది..ఒక వైపు నుంచీ కత్తి మహేష్ , మరో వైపు నుంచీ శ్రీ రెడ్డి, కొంతమంది సైడ్ యాక్టర్స్ , పూర్ణం కౌర్ ఇలా ఒకరి తరువాత ఒకరు పవన్ పై విమర్శలు చేస్తూ వచ్చారు అయితే..అయితే ఇదంతా చూస్తే శ్రీ రెడ్డి చేస్తున్న ఉద్యమాన్ని పక్క దోవ పట్టించే విధంగా ఉంది తప్ప మరేమీ కాదని శ్రీ రెడ్డి కావాలనే ఎవరితోనో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తోందని అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు..