పెళ్లి తర్వాత రీ ఎంట్రీ     2015-02-05   02:46:27  IST  Raghu V

Married Heroine Amala Paul Re Entry Confirmed

తెలుగు, తమిళంలో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్‌. ఈ అమ్మడు హీరోయిన్‌గా ఫుల్‌ క్రేజ్‌ ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. దర్శకుడు విజయ్‌ను ఆ మద్య పెళ్లి చేసుకున్న అమలాపాల్‌ మళ్లీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈమె కొన్ని కథలు కూడా విన్నట్లుగా తెలుస్తోంది. తమిళంలో పాండిరాజ్‌ దర్శకత్వంలో ఈమె నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

పెళ్లి తర్వాత కొన్ని రోజులు గ్యాప్‌ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా మరోసారి ఎంట్రీ ఇవ్వడంతో ఈ అమ్మడి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకున్న అమలాపాల్‌ సినిమాల్లో నటిస్తుందా అని తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈమె భర్త అనుమతితో పాండిరాజన్‌కు ఓకే చెప్పింది. ఆ సినిమ తర్వాత భర్త విజయ్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించే అవకాశముంది. పెళ్లికి ముందు సక్సెస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అమలాపాల్‌ ఇప్పుడు రీ ఎంట్రీతో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి. తమిళనాట ఈమె సక్సెస్‌ అయితే తెలుగులో కూడా ఈమెకు ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి.