అవును ‘మన్మధుడు 2’.. కాని అది మన్మధుడు కాదట..     2018-09-14   10:16:59  IST  Ramesh P

అక్కినేని నాగార్జున సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘మన్మధుడు’ చిత్రం ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ చిత్రంతో నాగార్జున ఇమేజ్‌ రెట్టింపు అయ్యింది. నవ మన్మధుడు అంటూ అంతా కూడా నాగార్జునపై ప్రశంసలు కురిపించారు. ఇక భారీ ఎత్తున ఆ చిత్రం వసూళ్లను కూడా రాబట్టి అప్పట్లో సూపర్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచింది. విజయభాస్కర్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో సోనాలి బింద్రె హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ను అందించాడు.

Manmadhudu 2,Manmadhudu 2 Is Not Sequel Of Manmadhudu,Nagarjuna Next Movie,rahul Ravindran,Sequel Of Manmadhudu,Tollywood New Movies

‘మన్మధుడు’ చిత్రానికి సీక్వెల్‌ అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. ఇటీవలే ఫిల్మ్‌ ఛాంబర్‌లో సినిమా టైటిల్‌ను ‘మన్మధుడు 2’ రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. ఈ కొత్త మన్మధుడు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్న ప్రేక్షకులకు నాగచైతన్య నుండి క్లారిటీ వచ్చేసింది. తాజాగా శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ, ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై ‘మన్మధుడు 2’ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించిన విషయం నిజమే. కాని అది ‘మన్మధుడు’ చిత్రానికి సీక్వెల్‌ కానే కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ‘చిలసౌ’ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతుంది. ఆ కథకు మన్మధుడు 2 టైటిల్‌ బాగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా చెప్పుకొచ్చాడు.

Manmadhudu 2,Manmadhudu 2 Is Not Sequel Of Manmadhudu,Nagarjuna Next Movie,rahul Ravindran,Sequel Of Manmadhudu,Tollywood New Movies

మన్మధుడు చిత్రంతో ఈ చిత్రంకు పోలిక ఉంటుంది, కాని మన్మధుడు చిత్రానికి ఇది సీక్వెల్‌ కాదు అంటూ తేల్చి చెప్పాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని ఆయన అన్నాడు. చిలసౌతో మంచి విజయాన్ని దక్కించుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ మరోసారి మన్మధుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.