మామిడి టెంకలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు     2018-05-17   22:19:08  IST  Lakshmi P

వేసవికాలం వచ్చిందంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది మామిడికాయ. తియ్యగా,పుల్లగా ఉండే మామిడికాయ అంటే అందరికి ఇష్టమే. అందరు చాల ఇష్టంగా తింటారు. కానీ మనం మామిడికాయను తినేసి టెంకను పాడేస్తాం. కానీ టెంకలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మొదట మామిడి టెంకలోని జీడిని తీసి పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిలో వెన్న కలిపి ముఖానికి రాస్తే ముఖం చాలా ప్రకాశవంతంగా మారుతుంది.

మామిడి టెంక పొడిలో కొబ్బరి నూనె,ఆలివ్ నూనె,ఆవ నూనె కలిపి రాస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.