మంగళ వారం ఈ పనులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా?     2018-06-12   00:36:39  IST  Raghu V

ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మంచి రోజు చూసుకొని పనులను ప్రారంభిస్తాం. అలాగే చేసే పని విజయవంతం కావాలని కోరుకుంటారు . అందువల్ల ఎవరు ఏ పనిని అయినా మంగళవారం ప్రారంభించటానికి ఇష్టపడరు. అయితే మంగళవారం కొన్ని పనులను చేయకూడదని మన పెద్దవారు చాలా గట్టిగా చెప్పుతూ ఉంటారు. వాటిని కొంత మంది పాటిస్తారు. అలాగే కొంతమంది తేలికగా తీసుకుంటారు. అయితే ఇప్పడు మంగళవారం ఏ పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.

తలస్నానము చేసే విషయంలో ఆడవారికి కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. మగవారికి ఆలా ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఆడవారైనా మగవారైనా మంగళవారం తలస్నానము చేస్తే మంచిది కాదట. ఆలా చేస్తే అశుభ ఫలితాలు రావటమే కాకుండా ఆ రోజు మంచి జరగదట.