మంగళ వారం ఈ పనులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా?     2018-06-12   00:36:39  IST  Raghu V

మంగళవారం కుజుడికి సంకేతం కాబట్టి ఆ రోజు చేసే పనులను బాగా అలోచించి చేయాలి. ఎందుకంటే కుజుడి ప్రభావం ప్రతి మనిషి మీద ఉంటుంది. కుజుడి ప్రభావం ఉంటే అన్ని కలహాలే వస్తాయి. అందుకే మంగళవారం ఏమి చేసిన కాస్త అలోచించి చేయటం మంచిది.

మంగళవారం గోళ్లు కత్తిరించకూడదు. అలాగే హెయిర్ కటింగ్ కి కూడా వెళ్ళకూడదు. అంతేకాక ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావటం కష్టం. అలాగే ఎవరి దగ్గరి నుంచి అయినా అప్పు తీసుకుంటే ఆ డబ్బు అనవసర ఖర్చులకు ఖర్చు అయ్యిపోతుంది.

మంగళవారం ఆంజనేయుని పూజించటం వలన కుజుడి కారణంగా వచ్చే సమస్యలు అన్ని తొలగిపోతాయి. మంగళవారం ఎర్రని పువ్వులతో ఎర్రటి బట్టలను కట్టుకొని తమ ఇష్ట దైవాన్ని పూజిస్తే అపాయాలు తొలగిపోతాయి. అయితే జాతకంలో కుజ దోషం ఉన్నవారు మాత్రం ఎరుపు రంగు దుస్తులను ధరించకూడదు.