మంచు విష్ణు.. మైండ్‌ పనిచేయడం లేదా?    2018-04-28   04:20:36  IST 

మంచు మోహన్‌బాబు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ఇప్పటి వరకు పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకోలేక పోయాడు. కెరీర్‌ ప్రారంభం అయ్యి దశాబ్దం దాటినా ఇప్పటి వరకు రెండు మూడు సినిమాలు పర్వాలేదు అనిపించాయి కాని మంచి కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రం రాలేదు. అయినా కూడా ఒక ఆలోచన అంటూ లేకుండా మంచు విష్ణు సినిమాలను ఎంపిక చేసుకుంటూ తన తెలివి తక్కువతనంను స్వయంగా నిరూపించుకుంటున్నాడు. ఒక కథను విన్నప్పుడు అందులో ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయా, కొత్త అంశాలు ఉన్నాయా అనే విషయాన్ని ఆయన గుర్తించడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈయన తాజాగా చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం అత్యంత దారుణంగా ఉంది. ఒక పరమ రొటీన్‌ కథాంశం, పరమ రొటీన్‌ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఏమాత్రం ఆకట్టుకోని కామెడీ ప్రేక్షకులకు విసుగు కలిగించింది. మంచు విష్ణు ఎందుకు ఇలాంటి కథలు ఎంచుకుంటున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు మంచు విష్ణుకు కథల ఎంపిక విషయంలో అనుభవం రాలేదని, ఆయన కథల ఎంపిక ఏ ప్రాతిపధికన చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదని అంటున్నారు.