Man dies after failing to jump like Baahubali from waterfall Inb

అపుడెప్పుడో 90లలో శక్తిమాన్ అంటూ ఒక టీవి సీరియల్ వచ్చేది గుర్తుందా ? ఈతరం వారు ఆ సీరియల్ ని ఎలా మరచిపోతారు లెండి. మన దేశంలో తోలి సూపర్ హీరో అతనేగా. అదేదో వెరైటి సౌండ్ తో బిల్డింగ్ మీది గుండ్రగా తిరుగుతూ ఆకాశంలోకి వెళ్ళిపోతుంటాడు శక్తిమాన్. ఆ దివ్యశక్తులు మనకూ ఉన్నాయేమో, అలా గాల్లో తిరిగితే మనము ఎగురుతామేమో అనుకోని కొందరు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇలాంటి విచిత్ర సంఘటనలు అమెరికాలో కూడా జరిగాయి. కాని సూపర్ హీరో వలన కాదు. ఓ సీరియల్ కిల్లర్ వలన. డెక్స్ టర్ అని ఒక టీవి సీరీస్ వచ్చేది. అందులో హీరో ఒక సీరియల్ కిల్లర్. తాను స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫోరెన్సిక్ సైంటిస్ట్ గా పనిచేస్తూ, చట్టం నుంచి తప్పించుకునే క్రిమినల్స్ కి చాలా ఘోరంగా, ప్లాన్డ్ గా, ఎవరికీ తెలియకుండా, ఎవరికి దొరక్కుండా చంపుతుంటాడు. అచ్చం ఆ హీరో చంపినట్లే, అమెరికాలో మర్డర్లు జరిగాయి. ఇలా ఉంటారండి జనాలు. సినిమాలు/ సీరియల్లు చూసి, తిక్క తిక్క వేషాలు వేస్తారు.