Malayalam actor Dileep arrested in actress’s kidnap and rape case

ప్రముఖ దక్షిణాది నటి భావన కిడ్నాప్ ఘటన మీకు గుర్తుకు ఉండే ఉంటుంది. అయిదు నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 17న భావన షూటింగ్ పూర్తీ చేసుకొని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆమెని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించింది. ఈ విషయాన్ని బయటకి చెప్పినట్లయితే విడియోని లీక్ చేస్తామని బెదిరించింది. ఈ ఘటన బయటకి రాకుండా ఉండిపోతుందని అనుకున్నారు ఆ దుండగులు. కాని మొండిధైర్యం నింపుకున్న భావన విషయాన్ని పోలీసులకి చెప్పింది.

ఈ ఘటన జరిగన వారానికే వారిని చేధించిన పోలీసులు పల్సర్ సున్ని, విజయ్ ఇతర గ్యాంగ్ మెంబర్స్ ని అరెస్టు చేసారు. అక్కడితో ఈ కేసు క్లోజ్ అవుతుందని అంతా అనుకుంటుండగా మరో మలుపు తిరిగింది. ఆ నటిపై ఈ గ్యాంగ్ సొంతంగా ఈ పనికి పాల్పడలేదని, ఎవరో చేయించారని పోలీసులకి అనుమానం వచ్చింది. జైల్లో దొరికిన ఓ లెటర్ ద్వారా మళయాళ అగ్రనటుడు దిలీప్ కుమార్ మీద పోలీసులు అనుమానపడ్డారు. అతడిని ప్రశ్నించగా సున్నితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎప్పుడు కలవలేదని దిలీప్ వివరణ ఇచ్చాడు. దిలీప్ కి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాలు అప్పటికి దొరక్కపోవడంతో పోలీసులు అతడిని వదిలేసారు.

ఇదిలా ఉంటే మరోవైపు సున్ని అండ్ గ్యాంగ్ జైల్లో నుంచే దిలీప్ ని బెదిరించడం మొదలుపెట్టారు. కోటిన్నర ఇస్తే ఊరుకుంటాం లేదంటే బయటకి సాక్ష్యాలతో సహా చేయించిన పనిని బయటపెడతాం అంటూ బెదిరించారు. ఈ ఫోన్ కాల్స్ రికార్డ్స్ ద్వారానే బయట పడ్డాడు దిలీప్. అనుమానం రాకూడదని తనకి బెదిరింపులు వస్తున్నాయని తానే కంప్లయింట్ రిజిస్టర్ కూడా చేయించాడు. కాని దిలీప్ సున్నితో కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇంతలో పోలీసుల చేతికి చిక్కింది. లెటర్, ఫోన్ రికార్డ్స్, ఇప్పుడు ఈ ఫోటో .. పోలీసులకి కావాల్సిన సాక్ష్యాలు దొరికేసాయి. ఇంకేం ఆలోచించకుండా నిన్న నటుడు దిలీప్ ని, అతని మేనేజర్ ని, అతని ఫ్రెండ్ ని నాదిర్ షా ని అరెస్టు చేసారు పోలీసులు.

భావన మీద దిలీప్ ఎందుకు పగబట్టాడు ? తన పబ్లిక్ ఇమీజ్ ని రిస్కులో పెడుతూ ఇలాంటి పని చేయించేంతా గొడవ ఏం జరిగింది ? ఇవన్ని కొద్దిరోజుల్లోనే తెలుస్తాయి.