యోని లోంచి రక్తం రావడానికి ప్రధాన కారణాలు  

యోని లోంచి రక్తం రావడానికి ప్రధాన కారణాలు

యోని కండరాల్లో నొప్పి, దర్వాసన పుట్టించే డిస్చార్జ్, ఇంఫెక్షన్స్, ఇలాంటి సమస్యలతో పాటు యోనిలోంచి రక్తం కారడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది చాలామందికి. కొన్ని సహజ సమయాల్లో కాకుండా, సమస్య లాగా యోనిలోంచి రక్తం కారడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం.

* సురక్షితమైన సెక్స్ లేకపోవడం వలన సుఖవ్యాధులు రావొచ్చు. కొన్ని సుఖవ్యాధులు వలన యోని లోంచి రక్తం ఎక్కువగా వస్తుంది. ఇది మంటగా, దురదగా అనిపించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.

* గర్భనిరోధక మాత్రలు ఎక్కువ వాడినా, జనానంగంలోంచి రక్తం కారొచ్చు. ఈ సమస్య అక్కడితో ఆగకుండా, స్త్రీ శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లపై చెడు ప్రభావం చూపుతుంది.

* పుండ్లు, ట్యూమర్లు, ఇంఫెక్షన్ల వలన కూడా బ్లీడింగ్ వస్తుంది. ఇలాంటి సమయాల్లో గోరుతో అసలు తాకకూడదు. అలా చేస్తే సమస్య చాలా తీవ్రంగా మారుతుంది.

* మెనోపాజ్ దశ మొదలవడానికి కొన్నిరోజుల ముందు కూడా బ్లీడింగ్ అవొచ్చు. మెనోపాజ్ మొదలవుతుంది అనే విషయానికి ఈ రకమైన బ్లీడింగ్ ఒక సంకేతం.

* ప్రెగ్నెన్సి మొదట్లో కూడా చాలామంది మహిళలకి వెజినల్ బ్లీడింగ్ అవుతుంది. హైపోథైరాడిజమ్ తో బాధపడుతున్నవారికి ఇలా జరుగుతుంది. ఇలాంటి కండీషన్ ని మిస్క్యారేజ్ అని అంటారు.

* మెనోపాజ్‌ దశలో మహిళ శరీరంలోని అండాశయాల్లో నిల్వ ఉన్న అండాలన్నీ కరిగిపోయి విడుదల ఆగిపోతుంది. హార్మోన్ల ఉత్పత్తి కూడా ఉండదు. దాంతో రుతుక్రమం నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో రక్తస్రావం జరిగితే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.