మహేష్‌ కంటే సంపూ నయం.. నిజమే కదా?     2018-04-26   06:07:20  IST  Raghu V

సినిమా పరిశ్రమ ప్రముఖులు ఏపీ ప్రత్యేక హోదా కోసం ముందుకు రావడం లేదని, వారికి ఈ విషయం అస్సలు పట్టినట్లుగానే వ్యవహరించడం లేదు అంటూ ఇటీవలే టీడీపీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఏపీ కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు చెందిన స్టార్స్‌ ఎవరు కూడా ప్రత్యేక హోదా విషయమై నోరు విప్పలేదు. సినిమా పరిశ్రమ ప్రముఖులు ప్రత్యేక హోదా కోసం రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

తాజాగా ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ సినిమా పరిశ్రమ వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తుంటే సినిమా ప్రముఖులు ముఖ్యంగా హీరోలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమా పరిశ్రమకు ఏపీ నుండి కోట్ల ఆధానం వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు ఏపీ ప్రజల కోసం వారు ముందుకు రావడం లేదు అంటూ చలసాని ప్రశ్నించాడు. ఈయన ముఖ్యంగా మహేష్‌బాబును టార్గెట్‌ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.