మహేష్ – ఎన్టీఆర్ కి ఇది నాలుగొవ పోటి .. గత మూడు సార్లలో గెలిచింది ఎవరంటే

2010 – వారం తేడాలో వచ్చాయి ఖలేజా, బృందావనం. ఎన్టీఆర్ రివేంజ్ తీసుకున్నాడు. ఇటు బృందావనం, అటు రోబో ‌.. రెండు సినిమాల మధ్య నలిగిపోయింది ఖలేజా. మూడు సంవత్సరాల తరువాత తిరిగొచ్చిన మహేష్ అభిమానుల్ని నిరుత్సాహపరిస్తే, ఓ సరికొత్త రూపంలో ఎన్టీఆర్ అభిమానుల్ని, ప్రేక్షకులని అలరించాడు.

2011 – సెప్టెంబరు 23న దూకుడుతో వచ్చాడు మహేష్, అక్టోబర్ 6న ఊసరవెళ్లితో వచ్చాడు ఎన్టీఆర్. ఈసారి మహేష్ దే పైచేయి. దూకుడు రికార్డు బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఊసరవెళ్ళి తుస్సుమంది.

2017 – ఆరు సంవత్సరాల తరువాత ఇద్దరు పోటిపడుతున్నారు. 21న జైలవకుశ, 27న స్పైడర్. మరి మహేష్ 2-1 లెక్కని 3-1 చేస్తాడో, లేక యంగ్ టైగర్ 2-2 చేసి లెక్క సరిచేస్తాడో చూడాలి.