Mahesh is doubtful but Pawan is set to make fans happy

దీపావళి ఎప్పుడు వస్తుందా అని ఇటు మహేష్ బాబు అభిమానులు, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మనలాగా వీళ్ళు టపాసులు కాల్చడానికి కాదు, తమ ఫేవరేట్ హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కోసం వేట్ చేస్తున్నారు. పవర్ స్టార్ కాటమరాయుడు, సూపర్ స్టార్ 23వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ దీపావళి కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే, దీపావళి కి కాటమరాయుడు రావడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ ఇప్పటికి పూర్తయిందట. యూనిట్ ఆ పోస్టర్ ని వదలడమే మిగిలుంది.

మరోవైపు మహేష్ – మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ దీపావళికి రానుందని వార్తలు వచ్చినా, మురుగదాస్ మాత్రం దీనిపై ఎలాంటి స్పందన తెలుపలేదు. ఈ సినిమా టైటిల్ “ఏజెంట్ శివ” అనే వార్తలు వస్తున్నా, యూనిట్ చడిచప్పుడు కాకుండానే ఉంది. ఇటు ఖండించకుండా, అటు కన్ఫర్మ్ చేయకుండా మహేష్ అభిమానుల్ని ఊరిస్తోంది.

మొత్తానికి ఈ దీపావళికి అభిమానుల్ని అలరించడానికి పవర్ స్టార్ రావడం ఖాయంగా కనబడుతోంది. సూపర్ స్టార్ రాక మాత్రం ఇంకా అనుమానంగానే ఉంది.