మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట

వేరే సినిమాలని, హీరోలని పొగుడుతూ, మహేష్ బాబు చేసినన్ని ట్విట్స్ మరే ఇతర టాలివుడ్ హీరో చేయలేదేమో. తనకి సినిమా నచ్చాలే కాని, చిన్న పెద్ద అని చూడడు, అంత పెద్ద స్టార్ అయిన ఎలాంటి మొహమాటం లేకుండా మంచి వర్క్ ని మెచ్చుకుంటాడు. ఆ అలావాటు మహేష్ ది. మరోవైపు పవన్ కళ్యాన్ తన ట్విట్టర్ ఖాతాని కేవలం రాజకీయ అంశాలకే వాడతాడు. మొన్న ఆమీర్ ఖాన్ దంగల్ మీద చేసిన ట్విట్స్ మినహాయిస్తే, పవన్ ఎప్పుడు ఏ సినిమా గురించి కూడా తన ట్విట్టర్ ద్వారా చెప్పింది లేదు. చివరకి తన అన్నయ్య చిరంజీవి సినిమా గురించి కూడా.

ఎలాగో ఫంక్షన్స్ కి హాజరవడం ఉండదు. ఓ నిమిషం కేటాయించి ఓ ట్విట్ పెడితే ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు చిరంజీవి అభిమానులు. అసలు సంబంధం లేని బాలివుడ్ హీరో ఆమీర్ ఖాన్ సినిమా గురించి పేజీలా కొద్ది పొగడ్తలు రాసిన పవన్, ఖైదీ నం 150 సినిమా మీద మాత్రం ఇంతవరకు తన స్పందన తెలియజేయలేదు. అసలు పవన్ ఇంతవరకు సినిమా చూసాడా లేదా కూడా ఎవరికీ తెలియదు .. ఇదీ పరిస్థితి అంటూ గగ్గోలు పెడుతున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్

. ఈరకంగా చూస్తే పవన్ కన్నా మహేష్ నయం అని, తానూ కుటుంబ సభ్యుడు కాకపోయినా, సినిమా చూసి, చిరంజీవి పునరాగమనం మీద సంతోషం వ్యక్తం చేసాడు, ఆ విషయం పవన్ ఎందుకు పట్టించుకోవడం లేదో,

పవన్ కి మాత్రమే అర్థం కావాలని బాస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .